top of page

కమ్యూనిస్టుల కంపు రాతలు, ప్రతీ పదం లో హిందూ ద్వేషం

shivashakthifounda





కాంగ్రెస్ తాను అధికారంలో వుండగా ఒక మీడియా ముఠాను తయారు చేసుకుంది. ఆ ముఠాలో సభ్యులు కావడానికి ముఖ్య అర్హత హిందూ, RSS, . అందుకే పార్టీలు సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అటు వామ పక్షాల పాత్రికేయుల నుండి ఇటు ప్రాంతీయ, కుటుంబ పక్షాల కొమ్ము కాసే పాత్రికేయుల వరకు ఈ ముఠాలో సభ్యులుగా ఉంటారు.


రాజ్య సభ టివి ఉపరాష్ట్రపతి గారి ఆధీనంలో ఉంటుంది. మోడీ ప్రధాని గా వచ్చాక కూడా శ్రీమాన్ హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ గా ఆయనే రాజ్యసభ టివి కంట్రోల్ చేసేవారు. రాజ్యసభ టీవీ లో "మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్" నిర్వహించడానికి గాను అన్సారీ గారు THE WIRE వెబ్ పోర్టల్ వ్యవస్థాపకుడు, మరియు గతంలో హిందూ పేపర్ ముఖ్య సంపాదకుడు గా చేసిన అమెరికన్ పౌరుడు శ్రీమాన్ సిద్ధార్థ వరద రాజన్ కి ఒక్కో ప్రోగ్రాం కి రు. 15000 చొప్పున మొత్తం అక్షరాల 33 లక్షల రూపాయలు ముట్టచెప్పారు. అదే వైర్ లో పని చేస్తున్న మరో వామపక్ష పాత్రికేయుడు MK వేణుకు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే ఇటువంటి పోగ్రాం కే మరో ₹14.70 లక్షలు ముట్ట చెప్పారు.


అంటే రూడ్ గా చెప్పాలంటే మోడీ ప్రభుత్వం ఉండగా ప్రభుత్వ టివి లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగ్రాం నడిపినందుకు అప్పనంగా ప్రజలు సొమ్ము సుమారు 50 లక్షలు వీరికి ధారపోసి తాము ప్రభుత్వం లో ఉన్నా లేకపోయినా కావలసినప్పుడు మొరగడానికి వీలుగా ఈ రెండు విశ్వాస కుక్కలను తయారు చేసుకున్నారు కాంగ్రెస్ తాము నియమించిన ఉపరాష్ట్రపతి ద్వారా అన్న మాట. మరి వీరికి వ్యతిరేక ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడే ఇంతగా దోచిపెడితే వారి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎంత దోచిపెట్టి ఉంటారో ఊహించలేం. పైకి తెలిసినవి ఇవి. మనకు తెలియకుండా వెనుక నుండి ప్రకటనల రూపంలో లేదా వీరికి చెందిన వాళ్ళకి ఏవైనా కాంట్రాక్టులు రూపంలో ప్రజల సొమ్ము ఎంత ధార పోసి ఉంటారో పై వాడికే ఎరుక.


వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి కాగానే వీరి ప్రోగ్రాం రెన్యూ చెయ్య లేదు. అందుకే మోడీ ప్రభుత్వం అంటే సిద్ధాంత రీత్యానే కాదు '"మా కడుపులు కొట్టాడండీ"

అన్నది సిద్దార్ద్ కి వేణు కి కడుపు మంట కి కారణం. అందుకే 'ద వైర్' పోర్టల్ నిండా పుంఖాను పుంఖాలుగా మోడీ వ్యతిరేక వ్యాసాలు/వార్తలు వస్తాయి. వ్యతిరేక వార్తలు, వ్యాసాలు తప్పు పట్టలేం. కానీ పచ్చి అబద్దాలతో వార్తలు, వ్యాసాలు సంపాదకీయాలు రాయడాన్ని వీళ్ళు ఎలా సమర్థించుకుంటారు?


ఈ వైర్ పోర్టల్ కి ఇన్ఫోసిస్, టాటా, విప్రో, బయోకాన్ వంటి అనేక ప్రముఖ సంస్థలు కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నాయి. నిష్పక్షపాత జర్నలిజం అనుసరించడానికి ఈ పోర్టల్ పెట్టాం అని చెప్పుకుంటూ కోట్ల రూపాయల చందాల మీద బతికే వీళ్ళకి కనీస పత్రికా విలువలు పాటించాలి అని తెలియదా?


గతంలో రాసిన తప్పుడు కథనాలు మీద పలుసార్లు క్షమాపణ చెప్పుకున్నారు ఈ పచ్చి వామపక్ష పోర్టల్ "ద వైర్" . వీటిల్లో ప్రముఖంగా చెప్పవలసింది అమిత్ షా కొడుకు కంపెనీ కోట్ల లాభాలు ఆర్జించింది అని తప్పుడు కథనం రాసి నందుకు 100కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కుంటూ సుప్రీమ్ కోర్టు చేత చివాట్లు తిన్నారు. అయినా ఇంకా బుద్ధి మారలేదు. ఇంకా సిగ్గులేని విషయం ఏమిటంటే తప్పుడు రాతలు రాసి వాటిని సమర్ధించుకో లేక 100 కోట్ల.పరువు నష్టం కేసు ఎదుర్కొడానికి మళ్ళీ చందాలు కావాలి అని పిలుపు ఇవ్వడం.


తాజాగా ఈ మధ్య ఒక సంపాదకీయం రాస్తూ బిజెపి పై మంచిగా రాసిన పోస్టులు వుంచడానికి, వ్యతిరేకంగా వచ్చినవి తీసెయ్యడానికి వీలుగా బిజెపి కేంద్ర ఐటి సెల్ ఇంఛార్జి అమిత్ మాలవియా కి ఫేస్ బుక్ కంపెనీ మేటా యాక్సిస్ ఇచ్చింది అంటూ రాసింది.


అది తప్పుడు రాత అని అమిత్ ఖండించడంతో వైర్ పోర్టల్ మెటా నుండి వచ్చిన ఈ మైల్స్ గా కొన్నిటిని సాక్ష్యంగా చూపించింది. అయితే మెటా కంపెనీ మేం ఆ ఈ మైల్స్ ఇవ్వలేదు అవి ఫోర్జడ్ ఈ మైల్స్ అని అధికారికంగా తెల్పడంతో, మా దగ్గర ఏదో పొరపాటు జరిగింది అని వైర్ పోర్టల్ చెప్పి ఆ కథనాన్ని ఉపసంహరించింది.

పొరపాటు జరిగినందుకు చింతిస్తున్నాము అని ప్రకటన విడుదల చేసింది. అంటే ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కథనాన్ని ప్రచురించి, దొరికిన తరువాత కూడా దాని సమర్ధింపుకి ప్రయత్నం చేసి అదీ కుదరక పోవడంతో సిగ్గు వదిలేసి తప్పు జరిగింది అని క్షమాపణ కోరాడు సిద్ధ వరదరాజన్.


కానీ, ఫేక్ న్యూస్‌తో మాల్వియాను ది వైర్ టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ మెటా కథనాన్ని రూపొందించడానికి ముందే వైర్ వారు అసాధ్యమైన సామర్థ్యాలతో కూడిన సూపర్ యాప్ 'టెక్ ఫాగ్' అనే కల్పనా కధ ప్రచురించారు. ఆ టెక్ ఫాగ్ కథనం కూడా ది వైర్ యొక్క సాంకేతిక నిపుణుడు దేవేష్ కుమార్ రచించాడు. ఆ కథనం కూడా అబద్ధం అని రుజువు అవ్వడంతో ఆ కథనాన్ని కూడా వైర్ ఉపసంహరించింది.

జోక్ ఏమిటంటే అపాలజీ చెప్పిన వెంటనే తప్పు జరిగింది, ఇకపై జాగ్రత్తగా వుంటాము, చందాలు ఇవ్వండి అని చందా దారులకు మళ్ళీ ఒక ముష్టి అభ్యర్థన కూడా చేసింది.


అయితే తనని ప్రత్యేకించి టార్గెట్ చేస్తున్న ద వైర్ పోర్టల్ ని అమిత్ మాలవ్యా సులభంగా క్షమాపణ లతో వదిలిపెట్ట దలచుకోలేదు. వైర్ పై క్రిమినల్ మరియు సివిల్ కేసులు వెయ్యడానికి నిర్ణయం తీసుకున్నాడు.


ఈ ఎపిసోడ్ వారి జర్నలిస్ట్ నైతిక విలువలను పూర్తిగా బట్టలూడదీసి నగ్నంగా ప్రపంచం ముందు నిలబెట్టింది. ఇక ముందు అయినా కాస్త బుద్ధి తెచ్చుకుంటారు అని ఆశిద్దాం.


....చాడా శాస్త్రి...

13 views0 comments

Kommentare


bottom of page