top of page

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో గల శివశక్తి హనుమాన్ వ్యాయామశాల నందు ఆదివారం ఉదయం ముఖ్య కార్యకర్తల సమా



గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో గల శివశక్తి హనుమాన్ వ్యాయామశాల నందు ఆదివారం ఉదయం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివశక్తి ఆధ్వర్యంలో తెనాలి మండల కేంద్రంగా నిర్వహించబోయే కార్యక్రమాలను ఎలా చేస్తే బాగుంటుందో చర్చించడంతో పాటుగా వాటి నిర్వహణ మరియు పర్యవేక్షణ కోసం శివశక్తి తెనాలి మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.


ప్రస్తుతం తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్న శివశక్తి హనుమాన్ వ్యాయామశాల ను పెద్ద ప్రదేశంలో అధునాతన వ్యాయామ సామాగ్రితో ఆధునీకరించాలని కూడా ఈ సమావేశంలో ప్రతిపాదన రావడం జరిగింది. ఈ సమావేశంలో తెనాలి ముఖ్య కార్యకర్తలతో పాటుగా జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు.




To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

6 views0 comments