శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ, మరువ పల్లి గ్రామం నందు గత కొన్ని వారాలుగా అన్యమత ప్రచారం, బలవంతపు మత మార్పిడుల కార్యక్రమాలు మరియు ఉద్దేశపూర్వకంగా 24 గంటలు ప్రతి గంటకు విపరీత శబ్దాలతో గంటలు మరియు వారి సందేశాలను వినిపిస్తున్నారు. అలాగే ఆ ఊరి హిందువుల కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలను మిఠాయిలు, ఆట వస్తువులు, బొమ్మలు ఇచ్చి మభ్యపెట్టి చర్చిలోకి పిలుచుకొని వెళ్లి బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు చర్చి వారితో మాట్లాడి ఇలాంటి పనులు చేయవద్దని చెప్పినా కూడా ఉద్దేశపూర్వకంగా అలాగే చేస్తున్నారు. అందుకని గ్రామస్తులందరూ ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ వారికి తెలియచేయగా ఈరోజు గ్రామస్తులు, శివశక్తి కార్యకర్తలు మరియు విశ్వహిందూ పరిషత్ నాయకులు నిరసన తెలియజేయడానికి వెళ్లగా అక్కడ పిల్లలను వశపరచుకోవడానికి సిద్దం చేసిన మత్తు పానీయాలు వాటి మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. అవి చూసి ఆగ్రహించిన గ్రామస్తులు ఇకపై మా గ్రామంలోకి అడుగుపెట్టొద్దంటూ వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు సోదాలు జరపి చర్చిలో మత్తు పదార్థాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
top of page
bottom of page
Comments