top of page
shivashakthifounda

జాడి మల్కాపూర్ గ్రామంలో కార్తిక పౌర్ణమి మహోత్సవం


జాడి మల్కాపూర్ గ్రామంలో కార్తిక పౌర్ణమి డిపోస్తవ మహోత్సవం దుర్గామాత మందిర్ లో ఘనంగా నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిథులుగా శివశక్తి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా జ్యోతి పండాల్ గారిని జిల్లా శివశక్తి అధ్యక్షులు ఎంపీ శ్యామ్ రావు గారిని విశేష అతిథి విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సత్సంగ్ ప్రముఖ రామ్ రెడ్డి గారిని శివశక్తి మండల అధ్యక్షులు, సంగమేశ్వర్ గారిని పిలవడం జరిగినది. కార్యక్రమం ప్రారంభానికి ముందు శివ శక్తి టీం దుర్గా మాత దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారి దర్శనంతరం శివ శక్తి టీం మరియు గ్రామ పెద్దలు మాట్లాడటం జరిగింది, పిల్లలు మంచి సాంప్రదాయ నృత్యాలు చేయడం జరిగింది. అనంతరం శివ శక్తి టీం నీ గ్రామస్తులు సన్మానించి గౌరవించారు. జ్యోతి పండాల్ గ్రామ మహిళలతో దీపోత్సవం లో పాల్గొని దీపాలను వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివ శక్తి జిల్లా అధ్యక్షురాలు మరియు బీజేపీ సీనియర్ లీడర్ జ్యోతి పండాల్, శివ శక్తి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ రావు, విశ్వ హిందూ పరిషత్ ప్రచార కర్త రాం రెడ్డి, శివ శక్తి మండల అధ్యక్షుడు సంఘమేశ్వర్, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

0 views0 comments

Comments


bottom of page