top of page

లక్ష్మీ గారు విజయవాడ నుండి ఘర్వాపసీ.

shivashakthifounda

లక్ష్మీ గారు విజయవాడ నుండి ఘర్వాపసీ.


వీరు నంబూరు కల్వరి చర్చ్ లో ప్రారంభం నుండి పరిచర్య ( స్వచ్ఛంద సేవ) చేశారు.

గత ఆదివారం శివశక్తి ఛానల్ లో టెస్టమొనీ ట్రోల్స్ లో వచ్చిన రిబ్కా ముక్కలు ముక్కలు సాక్ష్యం అప్పట్లో నిజమని భ్రమపడి..

రిబ్కా అక్క కు రెండు సెంట్ల స్థలం కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

వేరే కారణాలతో అది అవ్వలేదు.


రెండు సంవత్సరాల క్రితం నుండి శివశక్తి వీడియోలు చూస్తూ క్రమంగా చీకటినుండి వెలుగులోకి వచ్చారు.

ఇప్పుడు ఆమె ఒక పనికోసం హైద్రాబాద్ వస్తే నన్ను కూడా కలిసి వెళదామని కార్యాలయానికి వచ్చారు.

వీడియో చేసే ఉద్దేశ్యం లేదు.

నేను ఆమెతో మాట్లాడి, మీలాంటివారి సహకారం లేకుండా మేము చేసే పని సంపూర్ణం, విజయవంతం అవ్వదు.

నేను చెప్పేదానికంటే బాధితులుగా స్వానుభవంతో మీరు చెప్పే విషయాలకు ఎక్కువ విలువ ఉంటుంది.

ఇంకొంతమంది బాధితులు ఆ మాఫియా నుండి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది..

అని అర్ధమయ్యేలా చెప్పడంతో వీడియో చేయడానికి ఒప్పుకున్నారు.


ఇలాగే చాలామంది మేము తెలుసుకున్నాం చాలు..

పబ్లిక్ లోకి ఎందుకు రావడం? అనుకుంటూ..

ఇంకా రకరకాల భయాలతో బైటకు రావడంలేదు.

అందరూ వచ్చి గొంతు కలిపితేనే ఉద్యమం ఉదృతం అవుతుంది.

మతమార్పిడి రక్కసి నుండి మనదేశాన్ని రక్షించుకోగలం..


జై శ్రీరామ్..!


- కరుణాకర్ సుగ్గున

 
 
 

Comments


bottom of page