top of page
shivashakthifounda

వినాయక చవితి సందర్భంగా శివశక్తి


నిన్న వికారాబాద్ జిల్లా కేంద్రం లో “ బాల భక్త సమాజం “ వారు ప్రతీ ఏటా నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాలకు శ్రీ సదానంద రెడ్డి గారి ఆహ్వానం మేరకు వెళ్లడం జరిగింది.


సుమారు 300 వందల మంది మాతృమూర్తులు , పిల్లలు , స్థానికులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు హిందూ ధర్మ పరిరక్షణ లో శివశక్తి యొక్క పరిచయం మరియు మతమార్పిడిలపై

అవగాహన తో పాటు హిందుత్వం గురించి అనేక విషయాలు ఉపన్యసించడం జరిగింది.


కార్యక్రమం మొత్తం ఆసక్తిగా తిలకించిన సుమారు 30 మంది పిల్లలు ‘ భగవత్గీత “ లోని కొన్ని అధ్యాయాలు కంఠతా వల్లెవేయడం ఎంతో ఆసక్తిని , తృప్తిని కలిగించింది

తరువాతి తరం కూడా హిందుత్వం కోసం నిలబడతారని నమ్మకం కలిగింది


ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో , పూజ, భజనలతో క్రమశిక్షణగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు


శివశక్తి శంకర్ పల్లి సమన్వయకర్త Saikumar Goud Hindu అన్న , వికారాబాద్ టీమ్ నుండి Veeru Shivaji J కూడా ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది..


జై శ్రీ రామ్

జై శివశక్తి

జై బోలో గణేష్ మహారాజ్ కి

22 views0 comments

Comments


bottom of page