శంకర్ పల్లి లో శివశక్తి ధ్వజం వద్ద శివశక్తి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించడం జరిగింది...
- shivashakthifounda
- Oct 13, 2024
- 1 min read

అందరికీ జై శ్రీరామ్...
ముందుగా హిందు బంధువులకి నవరాత్రి మరియు బతుకమ్మ శుభాకాంక్షలు...
ప్రకృతి ఆరాధనే ఆ జగన్మాతకి ఇచ్చే ప్రథమ తాంబూలంగా తెలంగాణాలో సాగే ఈ బతుకమ్మ పండుగ, అందరి జీవితాల్లో ఆ జగన్మాత కృప మెండుగా ఉండాలనే ఆకాంక్షతో బుధవారం రోజు 09/10/2024 నాడు సాయంత్రం 6:00గం,,లకి శంకర్ పల్లి లో శివశక్తి ధ్వజం వద్ద శివశక్తి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించడం జరిగింది...
ఈ కార్యక్రమంలో ముందుగా "భరత మాత" నే మన జగన్మాత గా భావించి పూజ నిర్వహించాము, పూజానంతరం బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించాము...
బతుకమ్మ ల నిజ్జనం కొరకు ప్రయాణానికి ఆడపడుచులకి ఇబ్బంది కలగకుండా ఓ బస్సుని వారికి ఏర్పాట్లు చేసి, వారితో పాటే శివశక్తి కార్యకర్తలు మూసీవాగు వరకు వారితోనే వెళ్లి నిమజ్జనం, గంగమ్మ తల్లి పూజ, ఆడపడుచులు పసుపుకుంకుమ కార్యక్రమాలు పూర్తి అయ్యాక తిరిగి రావడం జరిగింది...
ఈ కార్యక్రమంలో నాతో పాటు శివశక్తి మండల అధ్యక్షుడు రాకేష్ లాల్, వినయ్ కుమార్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, సంతోష్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, ఆకాశ్ లాల్, హృషికేష్ గౌడ్ మరియు శ్రీకంఠ గౌడ్ లు పాల్గొన్నారు...
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే...🙏
జై శ్రీ రామ్...🚩🚩🚩
హర హర మహాదేవ...🔱🔱🔱
మీ...
G.S.కుమార్ గౌడ్
శివశక్తి(ఆధ్యాత్మిక చైతన్య వేదిక)
సమన్వయకర్త
9394 594 162
9642 594 162
Comments