top of page

శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ గారి పుట్టినరోజు సందర్బంగా సేవా కార్యక్రమాలు

Updated: Nov 5, 2022






శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక అధ్యక్షులు శ్రీ కరుణాకర్ సుగుణ గారి జన్మదినాన్ని పుష్కరించుకుని నిన్న గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో గల మానసిక వికలాంగుల వైద్యశాలల లోని 500 పైగా రోగులకు జ్యూస్ బాటిల్స్ మరియు ఇతర తినుండారాలను పంపిణీ చేయడం జరిగింది.


చాలామంది మానసిక వికలాంగులు వారికి ఈ ఆహార పదార్థాలు ఎందుకిస్తున్నారు అని అడిగి తెలుసుకుని కరుణాకర్ సుగుణ గారు చల్లగా ఉండాలని వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనఃస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వైద్యశాలల నిర్వహకుల సూచనల మేరకు వారి చిత్రాలను బ్లర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా శివశక్తి సభ్యులు పాల్గొనడం జరిగింది.




To know more

https://www.facebook.com/BharathaShivashakthi/

YouTube/shivashakthi

Twitter@shivashakthiorg

www.Shivashakthi.org

Call:8886600412

WhatsApp:9381625183

14 views0 comments