శివశక్తి ఆధ్వర్యంలో తొలిసారిగా ఆషాఢమాస మహోత్సవం...
ఎన్నో శతాబ్దాలుగా తెలంగాణలో ఆషాఢమాసాన గ్రామ దేవతారాధన ప్రతీ గ్రామ గ్రామాన చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది...
ఈ సందర్భాన్ని పురస్కరించి శివశక్తి సమన్వయకర్త సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శంకర్ పల్లిలో గల శివశక్తి ధ్వజాన్ని ప్రధాన వేదికగా చేస్కొని గ్రామస్తులతో కలిసి శంకర్ పల్లి గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లికి ఊరేగింపుగా వెళ్లి తొట్టెల సమర్పించడం జరిగింది...
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివశక్తి జాతీయ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కుమార్ చట్లపల్లితో పాటు ex-క్రిస్టియన్ ప్రవీణ్, మండల అధ్యక్షుడు రాకేష్ లాల్, మండల ప్రధాన కార్యదర్శి భాగ్యరాజ్, శ్రీపాల్ రెడ్డి, వినయ్ కుమార్, వికారాబాద్ జిల్లా ఇంచార్జి వీరేశం, దగ్గరలో ఉండే శివశక్తి కార్యకర్తలతో పాటుగా గ్రామ పెద్దలు, మహిళా మూర్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు...
ముందుగా భరతమాత పూజ, దుర్గా మాత పూజానంతరం మహిళల కోలాటంతో సాగిన ఈ కార్యక్రమం 6 గంటల పాటు సాగింది...
భారత్ మాతా కి జై...
హర హర మహాదేవ...
تعليقات