శివశక్తి (క్షేత్ర) కార్యకర్తలకోసం ఒక పాట రూపొందించాం.
త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి దివ్య ఆశిస్సులతో ముచ్చింతల్ లోని సమతామూర్తి ప్రాంగణంలో ఈ పాట చిత్రీకరణ పూర్తయింది.
అక్కడ చిత్రీకరణకు అనుమతి ఇవ్వడం సాధారణ విషయం కాదు.
మామూలుగా అయితే ప్రాంగణంలో ఫోన్ కి కూడా అనుమతి ఉండదు.
శ్రీ చినజీయర్ స్వామివారికి ఉన్న ధార్మికనిష్ఠ, శివశక్తి పై ఉన్న వాత్సల్యంతోనే ఇది సాధ్యమయింది.
ఈపాట రచయిత Srikanth Chinna అని ఇంతకుముందే తెలియజేశాం.
ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే ఈ పాటకు నేపథ్య సంగీతాన్ని ఒక ప్రముఖ సంగీత దర్శకులు ఉచితంగా సమకూర్చారు.
ఒక గొప్పపాటకు పనిచేసిన సంతృప్తి తనకు చాలన్నారు.
తన పేరు మాత్రం చెప్పవద్దన్నారు.
ఇక నృత్యభంగిమలు సమకూర్చిన సంధ్య గారు, మధుమతి గారు..
నాట్యప్రదర్శన చేసిన పిల్లలు ఈపాట పై ఎంతో ఇష్టంతో పనిచేశారు.
ఓసారి మధుమతి గారు- "మాపిల్లలు మీ పాటకి అడిక్ట్ అయిపోయారండి" అన్నారు.
అలాగే విన్నవారందరి హృదయాలలోకి ఈ పాట చొచ్చుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎడిటింగ్, డైరెక్షన్ విభాగాలు చూస్తున్న Siva Y Prasad అత్యుత్తమమైన ఔట్ ఫుట్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ఒక వారం రోజుల్లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం.
"క్షేత్ర" కు బలమైన పునాది వేయడంతోపాటు, శివశక్తి ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలువబోతుంది ఈ దృశ్య సందేశం.
జై శ్రీరామ్..!
- కరుణాకర్ సుగ్గున
Comments