అందరికీ జై శ్రీరామ్...🚩🚩🚩
18/08/2024.
సంగారెడ్డి, పోతరెడ్డి పల్లి X రోడ్డులో గల కేతకీ సంగమేశ్వర ఆలయంలో సంగారెడ్డి జిల్లా శివశక్తి కమిటీ నియామకం సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కుమార్ సమక్షంలో జరిగింది...
ఉమ్మడి మెదక్ జిల్లా సమన్వయకర్త సాయికుమార్ గౌడ్ నిర్వహించిన ఈ సమావేశానికి అతిథిగా సంస్థ వ్యవస్థాపక సభ్యుడైన అరుణ్ కుమార్, ముఖ్య అతిథిగా కళ్యాణ్ కుమార్ తో పాటుగా జిల్లా ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు...
మూడుసార్లు సభ్యుల ఓంకార నాదంతో మొదలైన సమావేశం, తదుపరి ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని అక్కడ మరణించిన హిందు సోదరులకి రెండు నిమిషాల మౌనం పాటించి, శత్రువులతో పోరాటం చేస్తున్న హిందువులకి హనుమత్ శక్తి ప్రసాదించమని "శ్రీరామ జయ రామ జయ జయ రామ" అనే వాక్యాన్ని 11 మార్లు సభ్యులంతా జపం చేయడం జరిగింది...
క్షేత్ర స్థాయిలో కమిటీ ప్రధాన ఉద్దేశ్యం, సంస్థ లక్ష్యాలు కార్యకర్తలకి వివరించిన తర్వాత సాయికుమార్ గౌడ్ కార్యకర్తల బాధ్యతలు ప్రకటించగా, కళ్యాణ్ కుమార్ కాషాయ కండువా కప్పి నూతన కమిటీని సన్మానించారు...
సంగారెడ్డి జిల్లా కమిటీ:
అధ్యక్షుడుగా శ్యాంరావ్ గారు, ఉపాధ్యక్షులుగా శివ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్, సెక్రటరీలుగా సతీష్ కుమార్, శివాజీ శ్రీనివాస్, శంకర్ గౌడ్, కో-ఆర్డినేటర్ గా పట్నం సురేష్, అడ్వైసర్ గా సుభాష్ రావ్ గార్లని నియమించడం జరిగింది...
త్వరలోనే జిల్లాలో గల మండల కమిటీల నియామకం కూడా జరుగుతుంది...
జై శ్రీరామ్...🚩🚩🚩
హర హర మహాదేవ...🔱🔱🔱
సాయికుమార్ గౌడ్
శివశక్తి(ఆధ్యాత్మిక చైతన్య వేదిక)
సమన్వయకర్త
9394 594 162
9642 594 162
Σχόλια