శివశక్తి హిందూ హెల్ప్ లైన్
“బలమే జీవనం, బలహీనతే మరణం. బలమే సంతోషం, శాశ్వతం, అమృత జీవనం. బలహీనతే ఎడతెగని ప్రయాస, దుఖం, మరణం" అని ఒక మహత్తర యథార్దాన్ని లోకానికి చాటారు స్వామి వివేకానంద.
స్వామీజీ బోధించింది జాతిని బలవంతులు కమ్మని. బలవంతులంటే కండబలం ఉపయోగించి దౌర్జన్యాలకు పాల్పడడం కాదు. తమ మీద తమకు నమ్మకం, ఆత్మనిగ్రహం కలిగివుండి, తోటి హిందూ సోదరుల కోసం పరితపించడం. స్వామీజీ ప్రతీ వ్యక్తికీ బాహుబలం (Physical strength)తో పాటు బుద్ధిబలం (Intellectual strength), ఆత్మబలం (Spiritual strength) కూడా ఉండాలంటారు.
స్వామీజీ వాక్కులను ఆచరణలోకి తీసుకువచ్చే ఈ ప్రయత్నానికి పేరే “శివశక్తి హిందూ హెల్ప్ లైన్”. దీని ద్వారా స్వామీజీ చెప్పిన బాహు, బుద్ధి, ఆత్మ బలాలతో పాటు ఆర్థిక బలం కూడ కలిగిన హిందూ సమాజ నిర్మాణం కోసం శివశక్తి ద్వారా కృషి చేస్తాము. ఎందుకంటే నేడు హిందూ సమాజం ఎదుర్కుంటున్న అనేక రుగ్మతలకు ఔషధం బలమైన హిందూ సమాజ నిర్మాణం మాత్రమే.
ప్రస్తుతం మనం చేస్తున్న మరియు చేయబోవు ప్రాజెక్టుల వివరాలు
వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు (పిల్లల్లకు )