Acerca de
పరిచయం
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్త్రుతుంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.