హిందూ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం 
చేయూత.jpg

హిందూ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశ్యం హిందువులు జరిపే ప్రతి ఆర్థిక లావాదేవీలు తోటి హిందువులతోనే చేయడం. దీని వలన ఒకరికి ఒకరు ఆర్థికంగా చేయూత అవడంతో పాటు రోజువారీ జీవితంలో అవసరమయ్యే నిత్య సేవలకు తోటి హిందువులను వినియోగించుకుంటూ వారితో సత్సంబంధాలు నెలకొల్పడం వలన ఆర్థికంగానే కాకుండా స్థానికంగా ఉండే హిందువుల మధ్య ఐకమత్యం కూడా బలపడుతుంది. 

 

అంతే కాకుండా ఏ ఏ రంగాలలో హిందువుల సంఖ్య తక్కువ ఉందో గమనించి ఆయా రంగాలలోకి హిందువులను చొప్పించడం ద్వారా అన్యమతస్తులు ఆధిపత్యం వహిస్తున్నటువంటి రంగాలు కూడా మన హిందువుల చేతుల్లోకి తిరిగి తీసుకు వచ్చే అవకాశం కూడా ఉంది. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే పూజాది క్రతువులకు అవసరమయ్యే పూలు, పండ్లు, ఇతర పూజ సామాన్లు వంటివి మన దేవీ దేవతల పైన ఎటువంటి శ్రద్ధ లేనటువంటి అన్యమతస్తుల దగ్గరనుంచి కొనుక్కునే కర్మ లేకుండా కొంతమంది నిరుపేద హిందువుల చేతనే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఏర్పాటు చేయించే ఆలోచన కూడా ఉంది. భవిష్యత్తులో దీని ద్వారా సమాజం లో పెను మార్పులు సంభవిస్తాయని బలంగా విశ్వసిస్తున్నాము.